బిపోర్జాయ్ తుఫాన్ కరాచీ తీరాన్ని తాకింది. దీంతో ప్రస్తుతం పాకిస్థాన్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరదల ఉధృతి, పిడుగుపాటుతో సహా పలు ఘటనల్లో 34 మంది మృతి చెందారు. 145 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు కోసం ప్రధాని షాబాజ్ షరీఫ్ ఫండ్స్ రిలీజ్ చేశారు. అలాగే సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.