ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదుకున్నది మేము, నాశనం చేసింది వైసీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 12, 2023, 02:09 PM

రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చేసిందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. దేశంలోని ప్రతి వర్గానికి, నిరుపేదకు మేలు చేకూర్చేలా ప్రధాని మోదీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. కరోనా సమయంలో దేశంలో 15కోట్ల మంది చనిపోయే అవకాశముందని అనేక సంస్థలు హెచ్చరించాయని, మోదీ దార్శనికతతో కోట్లాది మంది ప్రాణాలు రక్షించారన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచితంగా, అత్యంత వేగంగా టీకా అందించారన్నారు. గతంలో అతిపెద్ద ఆర్థిక శక్తి కలిగిన జాబితాల్లో దేశం 11వ స్థానంలో ఉంటే ప్రస్తుతం ఐదో స్థానానికి చేరిందని, రానున్న రోజుల్లో మూడో స్థానానికి చేరుకుంటుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని, అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోయిందని, చివరికి జీతాలు ఇవ్వలేని స్థితికి ప్రభుత్వం చేరడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి 25లక్షల ఇళ్లను కేంద్రం ఇస్తే, వైసీపీ ప్రభుత్వం ఎన్ని పూర్తిచేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com