కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖ పర్యటనకు వ్యతిరేకంగా అనకాపల్లి పట్టణంలో ఆదివారం వామపక్షాలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తూ అంబాని, అదానీలకు సంపదను దోచిపెడుతుందని ఆరోపించారు. నేటి వరకు విశాఖ రైల్వేజోన్ ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుందన్నారు. అమిత్‌షా గో బ్యాక్ అంటూ ఆందోళనకారులు నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు బాలేపల్లి వెంకటరమణ, ఎ.బాలకృష్ణ, రాజాన దొరబాబు, తాకాశి వెంకటేశ్వరరావు, పీఎస్ అజయ్‌కుమార్, గంటా శ్రీరామ్, డి. ఉమామహేశ్వరరావు, ఐద్వా నాయకులు జి. సుభాషిణి తదితరులు పాల్గొని అమిత్‌షా పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.