కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం RTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమలు చేస్తోంది. కార్యక్రమాన్ని ఆదివారం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే రూపకళ ఎం శశిధర్ బస్సు నడిపారు. పక్కనే ఉన్న డ్రైవర్ ఆమెకు సహాయం చేశారు. 'శక్తి పథకం' కింద మొదటి ట్రిప్‌ను ఆస్వాదించడానికి కొంతమంది మహిళా ప్రయాణికులు ఆ బస్సు ఎక్కారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa