ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు గడిచిన వారు ఆధార్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకునే గడువు రేపటితో ముగియనుంది. జూన్ 14లోగా మై ఆధార్ పోర్టల్‌లో ఉచితంగా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులోని పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, లింగం, ఫోన్ నంబర్, ఈ మెయిల్ వంటివి ఉచితంగానే చేసుకోవచ్చు. ఫోటో, ఐరిస్, బయోమెట్రిక్ వివరాల కోసం రూ.50 చెల్లించి ఆధార్ సెంటర్లో చేసుకోవచ్చు.