చైనాలో ఉన్న భారత ఆఖరి జర్నలిస్ట్ స్వదేశానికి రానున్నారు. పీటీఐకి చెందిన సదరు జర్నలిస్ట్ వీసా గడువును పొడగించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఈ నెల చివరి నాటికి ఆ జర్నలిస్ట్ భారత్‌కు పయనం కానున్నారు. 2023 ప్రారంభంలో నలుగురు భారతీయ జర్నలిస్టులు చైనాలో ఉండేవారు. వీసా గడుపు ముగియడం, ఆ దేశం భారత జర్నలిస్టులను వెళ్లిపోవాలని సూచించడంతో ముగ్గురు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆఖరి జర్నలిస్ట్ కూడా త్వరలో భారత దేశానికి రానున్నారు.