టీడీపీ హయాంలో బీసీలకు అందించిన సంక్షేమ పథకాలు, వైసీపీ పాలనలో అరాచకాలను ప్రజలకు వివరించాలని టీడీపీ బీసీ సెల్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య అన్నారు. సోమవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన బీసీ సాధికార సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల పోరుబాట పేరుతో రచ్చబండ, ఇంటింటి ప్రచార జాతర కార్యక్రమాలు నిర్వహించి క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళుతున్నామన్నారు. ఎన్నికల మినీ మేనిఫెస్టో, రాయలసీమ డిక్లరేషన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. టీడీపీతోనే బీసీల సాధికారత సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన పూల నాగరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుల లక్ష్మీనరసింహులు, రాష్ట్ర నాయకులు గంజే నాగరాజు, బ్రహ్మయ్య, దళవాయి వెంకటనారాయణ, నగర అధ్యక్షుడు సిమెంట్ పోలన్న, గాండ్ల, కుమ్మర, కురబ, వడ్డెర, సాధికార సమితా రాష్ట్ర కన్వీనర్లు, విశాలాక్షి, పోతులయ్య, రమణ, వెంకట్, నాయకులు కురుబనారాయణస్వామి, గోపాల్గౌడ్, ప్రతా్పనాయుడు, వన్నూరు, బండి పరశురాముడు, మణి రవి, కొండయ్య, మల్లికార్జున పాల్గొన్నారు.