బెంగళూరులో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన కూతురు తల్లిని చంపేసి శవాన్ని సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. అది చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురై.. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తుంది. బెంగళూరులో తల్లితో కలిసి నివాసముంటోంది. తరచూ వీరి మధ్య గొడవలు జరిగేవి. సహనం కోల్పోయిన కూతురు తన తల్లిని చంపేసినట్లు విచారణలో అంగీకరించిందని పోలీసులు తెలిపారు.