ఎండలు, వడగాడ్పుల కారణంగా విపరీతమైన డిమాండ్ రావడంతో బొండాల ధరలు పెరిగాయని కొబ్బరి బొండాల రిటైల్ వ్యాపారులు చెప్తున్నారు. కానీ, రుతుపవనాల రాక ఆలస్యమై, ఎండలు, వడగాడ్పులకు దిగుబడి లేక బొండాలకు డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కొబ్బరి తోటలపై తెల్ల దోమ దాడి ఉధృతమైంది. తెల్లదోమ సోకితే.. కాపు తగ్గిపోతుందని కొబ్బరి రైతులు చెప్తున్నారు. పొడి వాతావరణం వల్ల తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయని, వర్షాలు కురిస్తేనే తోటలు జీవం పోసుకుంటాయని అంటున్నారు. కాగా, వేసవి కారణంగా కొన్ని పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. గత నెల వరకు కిలో రూ.100 చొప్పున అమ్మిన నల్ల, తెల్ల ద్రాక్ష ఇప్పుడు ఏకంగా రూ.200 చెప్తున్నారు. దానిమ్మ పండ్లు రూ.100కు రెండు, మూడు మాత్రమే ఇస్తున్నారు. తెల్ల కిస్మిస్ అసలు మార్కెట్లోనే లేకుండా పోయింది. నాటు, హైబ్రిడ్ పుచ్చ కాయలు కూడా మార్కెట్లో లేకుండా పోయాయి. నల్లవి చిన్న కాయ కూడా రూ.50పైనే చెప్తున్నారు.