ఇద్దరు ఎయిర్ ఇండియా పైలెట్లపై వేటు పడింది. విమానం కాక్‌పిట్‌లోకి గర్ల్ ఫ్రెండ్‌ను తీసుకువెళ్లడంతో పైలెట్లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి లేహ్‌కు వెళ్తున్న విమానంలో గత వారం చోటుచేసుకుంది. క్యాబిన్ సిబ్బంది నుంచి ఫిర్యాదు అందడంతో పైలెట్, కో పైలెట్‌పై ఎయిర్ ఇండియా యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని, దాని ప్రకారమే చర్యలు తీసుకున్నామని పౌర విమానయాన సంస్థ పేర్కొన్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa