వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సునీతా రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్‌కు ముందస్తు బెయిల్ లభించింది. ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని, ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును సునీత ఆశ్రయించారు.