పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్న ఇద్దరు విశాఖ నేవీ అధికారులు సీబీఐకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. భానుప్రతాప్ అనే కాంట్రాక్టర్ కు సంబంధించి రావాల్సిన రూ.26లక్షల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని కోరగా బిల్లు చెల్లించేందుకు తమకు రూ.26వేలు లంచం ఇవ్వాలని సీడీఏలోని సీనియర్ ఆడిటర్ తెలికిచెర్ల రవికుమార్, డీఏఓ భీశెట్టి నూకేశ్వరరావు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు వారు లంచం తీసుకుంటుండగా అరెస్టు చేసినట్లు మంగళవారం తెలిపారు.