హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా పిప్లిలో పొద్దుతిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించాలని గత కొన్నిరోజులుగా రైతులు చేపడుతున్న ఆందోళనలు ఎట్టకేలకు మంగళవారం రాత్రికి సద్దుమణిగాయి. హర్యానాలో సుమారు 37వేల ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంట సాగుచేశామని, మద్దతు ధర ఇవ్వకపోతే తాము నష్టపోతామని రైతులు నిరసనలకు దిగారు. ఈక్రమంలోనే మంగళవారం ఢిల్లీ - చంఢీఘర్ హైవేరోడ్డును నిర్భంధించారు. అయితే ఎట్టకేలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అధికారులు రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాజేష్ టికాయత్ వెల్లడించారు.