దేవుడి ముసుగులో ఓ కీచకబాబా బాగోతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. తమిళనాడుకు చెందిన షైక్నాల్ లబ్బే(58) అనే వ్యక్తి 40ఏళ్లుగా వరంగల్ లో స్థిరపడ్డారు. తనకు మంత్రశక్తులు ఉన్నాయని తాను కుటుంబకలహాలు, భార్యభర్తల మధ్య తగాదాలు, ఆరోగ్య సమస్యలు వుంటే పరిష్కరిస్తానని నమ్మించి పలువురు మహిళలను, యువతులను లోబరుచుకున్నాడు. ఈక్రమంలోనే ఓవివాహితపై లైంగిక దాడిచేయగా ఆమె ఇంట్లో చెప్పింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా వారు కీచకబాబా బాగోతాన్ని బట్టబయలు చేశారు.