రాజకీయ లబ్దికోసమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని మంత్రి బొత్సా సత్యనారాయణ మండిపడ్డారు. ఇటీవల విశాఖలో జరిగిన సభలో అమిత్ షా జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. దీనిపై స్పందించిన బొత్స కేవలం ఎన్నికలు వస్తున్నాయనే అమిత్ షా ఇలాంటి వ్యాక్యలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక కడుపులో మంటతో గురువింద గింజలా మాట్లాడారని ధ్వజమెత్తారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు.