నరసరావుపేట పట్టణంలో బుధవారం టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, డా౹౹చదలవాడ అరవింద బాబు పర్యటించారు. నరసరావుపేట పర్యటనలో ఉన్న టీడీపీ నేతలకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ కార్యకర్తల గృహాల్లో జరిగిన పలు శుభకార్యాలకు హాజరై టీడీపీ కార్యకర్తలను ఆశీర్వదించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు కన్నా లక్ష్మీనారాయణ, డా౹౹చదలవాడ అరవింద బాబులను ఊరేగింపుగా నరసరావుపేట పట్టణంలో తిప్పుతూ. తెలుగుదేశం జిందాబాద్, అరవింద బాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ నరసరావుపేట పట్టణంలో పండుగ వాతావరణం సృష్టించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa