ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన రావూరి వెంకటేశ్వరావు ( బోర్రయ్య) బుధవారం రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ పార్టీ క్షేత్రస్థాయి అభివృద్ధికి, రానున్న ఎన్నికల్లో విజయానికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. మంత్రితోపాటు రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, సత్తెనపల్లి ముప్పాళ్ళ మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, వైయస్సార్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు.