క్యాన్సర్ బాధితుల కోసం ముగ్గురు కేశాలు దానం ఇప్పటికి వరకు 32 మంది కేశాలు దానం చేసినట్లు హెల్పింగ్ మైండ్స్ అబూబక్కర్ సిద్దిక్ పేర్కొన్నారు. క్యాన్సర్ భాదితులు కీమోథెరపి సమయంలో జుట్టు రాలిపోయి మనోవేదనకు గురై ఆత్మహత్య లకు పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వారిలో ఆత్మస్థైర్యం నింపడానికి హెల్పింగ్ మైండ్స్ చేపట్టిన హెయిర్ డోనేషన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుంది. బుధవారం మదనపల్లి 22వ వార్డ్ కౌన్సిలర్ ముబీనా కుమార్తె అర్ఫా అంజూమ్, మదనపల్లి ఎస్టేట్ కు చెందిన రేనా, నిమ్మనపల్లి కు చెందిన పావని ముగ్గరు హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి తమ కేశాలను దానం చేశారు. వీరికి ప్రశంస పత్రం తోపాటు పూలమొక్కలు బహుకరించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ వయసులో చిన్న వారైనా సేవా గుణంలో గొప్ప మనసును చాటుకుంటూ చిన్నారులు, యువతులు కేశాలు దానం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు.