రైల్వే కోడూరు నియోజకవర్గంలో భూ సమస్యలు దళితులకు మాత్రమే ఎక్కువగా ఉన్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. బుధవారం రైల్వేకోడూరులో ఆయన మాట్లాడుతూ ఎనిమిదో విడత భూ పంపిణీ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేదలకు వ్యవసాయ భూమి ఒక్కొక్కరికి రెండు ఎకరాల ప్రకారం పట్టాలు, పాసుబుక్కులు మంజూరు చేయాలని కోరారు. కోడూరు పట్టణం లో రైల్వే అండర్ బ్రిడ్జి, ప్రాజెక్టులు, గవర్నమెంట్ ఫ్రూట్ నర్సరీ, కోల్డ్ స్టోరేజ్, డ్రైనేజ్, రైల్వే కోడూరు వెంకటగిరి ఘాట్ రోడ్డు నిర్మాణం సమస్యలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది అధికారులు మారిన మాటలకే పరిమితం తప్ప ప్రజలు సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, సహాయ కార్యదర్శి పి మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు టి రాధాకృష్ణ, దేవర, రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య పాల్గొన్నారు.