అనకాపల్లి-తాడి రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ బాగా దెబ్బతింది. ఈ కారణం గా విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్ర ఆలస్యం. ఇప్పటి వరకూ ఐదు రైళ్లను రద్దుచేశారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని ఆలస్యంగా నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. రద్దైన వాటిలో జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ రైళ్లు ఉన్నాయి. అనకాపల్లి ఘటన ప్రభావం విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ పై పడింది. పట్టాల రిపేర్ కారణంగా ఈ ఎక్స్ ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా నడవనుంది. ఉదయం 5.45గంటలకు విశాఖ నుంచి బయల్దేరాల్సిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఉదయం 8.45కు బయలుదేరనుంది. దీంతో పాటు మరికొన్ని రైళ్ల రాకపోకల సమయంలో అధికారులు మార్పులు చేశారు.