విశాఖ జిల్లా అగనంపూడి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యుల ముఖ్య సమావేశంను అసోసియేషన్ అగనంపూడి లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర టైలర్స్ వేదిక వ్యవస్థాపకులు అతికినిశెట్టి సత్యనారాయణ హాజరై సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో ఎంతో వైభావంగా వున్న టైలర్ వృత్తి నేడు రడీమేడు అందుబాటులో కి వచ్చిన తరువాత ఈ వృత్తి కి ఆదరణ తగ్గినదని కావున సభ్యులు అందరూ ఐకమత్యంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నదని టైలర్ సోదరులకు ఏ కష్టం వచ్చినా వారికి మనమందరం అండగా నిలవాలని మరియు టైలర్స్ పొదుపు అలవాటు చేసుకోవాలని, సంఘ సభ్యులకు హితబోధ చేసారు. అగనంపూడి టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు దాసరి సత్యవేణి మాట్లాడుతూ, టైలర్స్ కి 50 సంత్సరాలు నిండిన వారికి ప్రభుత్వం పింఛనులు మంజూరు చేయాలని, టైలరింగ్ షాప్ లకు 150 యూనిట్లు వరుకు ఉచిత విద్యుత్ అందించాలని, ఆర్ధిక పరిస్థితులతో శతమతమౌతున్న ధర్జీలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో. అధ్యక్షురాలు దాసరి సత్యవేణి. తలారి శ్రీనివారావు. కోసూరు తాతారావు. గంగాధర్. వి. శంకరరావు. బాబురావు, డీఎం నాయుడు. రవి. తదితరులు పాల్గొన్నారు.