అనకాపల్లి పట్టణం 82 వ వార్డు లో జాతీయ రహదారి సమీపంలో యు పివిసి తలుపులు, కిటికీలు తయారు చేసే రమ్య ఎంటర్ప్రైజెస్ చిన్న తరహా పరిశ్రమను బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా, మంచి నైపుణ్యంతో చిన్న తరహా పరిశ్రమను ప్రారంభించి, మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలోరమ్య ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ గాది బెన్న స్వామి (చినబాబు), ఏ ఎం ఏ ఎల్ కళాశాల యాజమాన్య కమిటీ సభ్యులు వాసిరెడ్డి బాలకృష్ణ, పైల రామారావు, ఫైల నర్సింగరావు, పాటూరి నాయుడు, లాలం గణేష్, రెడ్డివెంకటరమణతదితరులు పాల్గొన్నారు.