అనకాపల్లి గవరపాలెం శతకంపట్టు వద్ద వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం షష్టిమ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 17 నుండి ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఆలయ ప్రాంగణం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కర్రి సన్యాసినాయుడు వార్షికోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. 17వ తేదీ కుంకుమ పూజలు 18వ తేదీ హోమం, గోపూజలు, 19 తేదీ రాత్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం ఆలయం వద్ద ఘనంగా జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ, ఆలయ నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు