దిశా యాప్ మొబైల్ లో ఉంటే మరో వ్యక్తి తోడు ఉన్నట్లేనని రేపల్లె గ్రామీణ సీఐ శివశంకర్ అన్నారు. బుధవారం చెరుకుపల్లిలోని అంబేద్కర్ సెంటర్లో దిశ యాప్ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో సిఐ పాల్గొన్నారు. దిశ యాప్ మహిళలకు రక్షణ కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దిశ ఎస్ ఓ ఎస్ యాప్ బటన్ నొక్కితే తక్షణమే పోలీసులు స్పందించి ఆ ప్రదేశానికి చేరుకుంటారని అన్నారు. రెండు రోజులు పాటు దిశ యాప్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సిఐ శివశంకర్ తెలిపారు. కార్యక్రమంలో చెరుకుపల్లి ఎస్సై డి వెంకట కొండారెడ్డి ఏఎస్ఐలు బ్రహ్మం, శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.