విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ ఉద్యోగిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ ఘటన యూపీలో మంగళవారం జరిగింది. ఉన్నతాధికారి సమావేశానికి సదరు ఉద్యోగి షర్ట్ లేకుండా బనియన్ తో మాత్రమే వచ్చారు. దీంతో చుట్టుపక్కల అధికారులు అసౌకర్యానికి గురయ్యారు. విద్యా శాఖపై జిల్లాల వారీ సమీక్షలో ఇలా జరగ్గా, మీటింగ్ అనంతరం సదరు ఉద్యోగిపై డైరెక్టర్ జనరల్ విజయ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు.