జమ్మూకశ్మీర్ లో బుధవారం తెల్లవారుజామున 2:20 గంటలకు కత్రా, దోడా ప్రాంతాల్లో వరుసగా మూడుసార్లు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై మొదటిది 4.3 తీవ్రత కాగా కత్రాకు 81 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో ఉంది. రెండోది 3.5గా నమోదు కాగా, భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మూడోది 3.3 తీవ్రతతో కిష్త్వార్ లో 5 కి.మీ లోతులో ఉందని తెలిపింది.