కర్ణాటకలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పించడంతో బస్సుసర్వీసులన్నీ కిటకిటలాడాయి. గతంతో ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలను ఆశ్రయించేవారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పించడంతో మహిళలు దాదాపుగా ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులే కాకుండా బస్టాండ్ లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదిలావుంటే బస్సుల్లో మహిళల రద్దీ అధికమవ్వడంతో పురుషులకు 50శాతం సీట్లను ఆర్టీసీ అధికారులు కేటాయించారు.