జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం అన్నవరం గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి సత్తెన్న స్వామి దేవాలయానికి పవన్ వచ్చారు. సత్యనారాయణ స్వామిని దర్శించుకుని.. ఆపై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవన్.. వేద పండితుల నుంచి ఆశీర్వచనాన్ని స్వీకరించారు. దర్శనానంతరం జనసేనాని తిరిగి గెస్ట్‌హౌస్‌కు బయలుదేరి వెళ్లారు.