జగన్ సర్కార్ నాలుగేళ్లలో సాధించింది ఏంటి అంటే హత్యలు, ఆత్మహత్యలు, జైళ్లు, బెయిల్ల్లే అని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... అభివృద్ధి లేదు, అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు. ప్రైమరీ స్కూల్లో టీచర్స్ చేయాల్సిన పనులు జగన్ చేస్తున్నారని.. ఆయనకు రేపు ఎన్నికల్లో కనీసం 20-30 సీట్లకు మించి రావని స్పష్టం చేశారు. ఏపీలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు జగన్కు ఇటు చంద్రబాబుకు ఓటేసే పరిస్థితి లేదన్నారు. వారంతా కొత్త ముఖం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వారి దృష్టి కాంగ్రెస్ మీద పడిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి అధికారం చేపడుతుందని... అదే మాదిరిగా ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.