జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటన సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. వారాహియాత్రలో భాగంగా పిఠాపురం పట్టణం ఉప్పాడ సెంటర్లో పవన్ నిర్వహించనున్న సభ ప్రాం తాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. 14వ తేదీన కత్తిపూడి, 16న పిఠాపురం, 18న సర్పవరంల్లో పవన్ సభలు ఉంటాయని, మిగిలిన రోజుల్లో పార్టీ కార్యక్రమాలు ఉంటాయని సమాచారమిచ్చారని ఎస్పీ వివరించారు. సభలకు వచ్చే ప్రజలను ఆ రోజు ఉదయం అంచనా వేసి అం దుకు తగ్గట్టుగా బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు. పవన్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బం దులు తలెత్తకుండా చూస్తామని చెప్పారు. ఆయా ప్రాంతాల పోలీసు అధికారులతో జనసేన నాయకులు టచ్‌లో ఉన్నారని తెలిపారు. వారాహి యాత్ర ప్రశాంతంగా సాగేందుకు అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, కాకినాడ డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి, పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఉన్నారు. అంతకు ముందు వారాహియాత్ర రూట్‌ను ఎస్పీ పరిశీలించారు.