రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వారాహి యాత్రను కాకినాడ జిల్లానుంచి ప్రారంభిస్తుండ డంతో సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. జనసేన పార్టీకి కాకినాడ జిల్లా రాజకీయంగా మంచి పట్టున్న ప్రాంతంగా మొదటినుంచీ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతు న్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడినుంచే పవన్ ఎన్నికల శంఖారావం పూరిస్తుండడంతో యాత్ర భారీగా విజయవంతం అవుతుందని పార్టీనేతలు ధీమా కనబరుస్తున్నారు. పైగా అన్నవరం సత్యదేవుడి దర్శనంతో వారాహి యాత్రను మొదలుపెడుతుండడం పార్టీ నేతలు సెంటిమెంట్‌గా భావిస్తు న్నారు. మరోపక్క పవన్ పర్యటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పార్టీ నేత లు అన్నవరానికి చేరుకున్నారు. యాత్ర తొలిరోజు కావడంతో జిల్లాతో పా టు చుట్టుపక్క ఇతర జిల్లాలనుంచి కూడా నేతలు, పార్టీ శ్రేణులు, అభి మానులు తరలివస్తున్నారు. పవన్ యాత్ర ద్వారా జిల్లాలో తమ బలం ఏస్థాయిలో ఉందో చూపించాలని నేతలు పట్టుదలగా ఉన్నారు. అందుకో సం అన్నవరంనుంచి బహిరంగ సభ జరిగే కత్తిపూడివరకు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో నింపేశారు. ఒకరకంగా చెప్పాలంటే తొలిరోజు ఆరం భం రాష్ట్రం మొత్తం తమ బలాన్ని చాటేలా ఉండాలని నేతలు భావిసు ్తన్నారు. కాగా విజయవాడలో మంగళవారం పూజలు ముగించుకుని పవన్‌కళ్యాణ్ రాత్రి కి రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. అక్కడినుంచి రోడ్డుమార్గం ద్వారా ్ధరాత్రి అన్నవరం కొండపై బస ప్రాంతానికి వెళ్లారు. వారాహి వాహనం సైతం అన్నవరానికి చేరుకుంది. దీనికి బుధవారం ఉదయం సత్యదేవుడి ఆలయంవద్ద పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇదే వాహనంపై కత్తిపూడి సభలో పవన్ ప్రసంగించనున్నారు. కాగా తన పర్యటన మొ త్తం పవన్ అన్నివర్గాలకు చేరువయ్యేలా వ్యూహం రూపొందించుకున్నార ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అన్ని సామాజికవర్గాల ప్రజలు, నేతలు, నిపుణులతో చర్చలు జరిపి వారి మనోభిప్రాయాలు పవన్ తెలుసుకోను న్నారు. జిల్లాలో అనేక వృత్తులకు సంబంధించి సమస్యలున్నాయి. ప్రతి రోజూ ఉదయం ఆయా వర్గాలనుంచి విజ్ఞాపనలు స్వీకరించి వారి సమ స్యలను పవన్ ఆలకిస్తారు. అవి పరిష్కారం అయ్యేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేయనున్నారు. జిల్లాలో వారాహి యాత్ర విజయ వంతం అయ్యేందుకు పార్టీ ఏడు ప్రత్యేక కమిటీలు కూడా నియమించిం ది. కాగా వారాహి యాత్రలో పవన్ ప్రసంగం ఏస్థాయిలో ఉండబోతుంద నేది పార్టీ శ్రేణులు భారీ అంచనాలు వేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై ధ్వజంతోపాటు జిల్లాలో ఆ పార్టీ నేతల భాగోతాలను పవన్ ప్రస్తావించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.