గ్రీస్‌లో వలసదారులతో వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 78 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని, తూర్పు లిబియా నుంచి ఇటలీకి వలస వచ్చిన వారితో వెళ్తున్న పడవ దక్షిణ గ్రీస్ సముద్రం నుంచి 75 కిలోమీటర్ల దూరంలో బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 104 మందిని రక్షించినట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa