తిరుమల శ్రీవారిని బుధవారం రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ, వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ సేవించి దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మంత్రి మాట్లాడుతూ ముందుగా ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాణ్డె నాస్తి కించనః వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని స్వామి వారిని స్మరిస్తూ శ్రీవారిని స్వామివారిని దర్శించుకున్నానని, తాను ప్రధానంగా వేడుకున్నది కోరుకున్నది ఏమంటే అంటూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం పాలనలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సుస్థిరమైన జీవనాన్ని సాగించే దిశగా పాలన అందిస్తున్నారని అన్నారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనపై కొంత మంది దురుద్దేశంతో బురద చల్లుతున్నారని, కానీ ముఖ్యమంత్రి సత్సంకల్పంతో స్వామి ఆశీస్సులతోపాలకుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డిని మరింతగా అనుగ్రహించమని, వారి మంచి ఆలోచనలు సిద్ధించాలని ఈ రాష్ట్రంలోని ప్రజల కష్టాలని తొలగించాలని, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించమని స్వామి వారిని వేడుకున్నానని తెలిపారు.