బిపర్‌జాయ్ తుఫాన్ నేడు (గురువారం) గుజరాత్ తీరాన్ని తాకనుంది. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల మధ్య పాకిస్థాన్ తీరం సమీపంలోని కచ్‌లో ఉన్న జఖౌ పోర్టు, జకావ్ పోర్టు వద్ద ఈ తుఫాన్ కేంద్రీకృతమవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం బిపర్‌జాయ్ తుఫాన్ గుజరాత్ తీరానికి 200 కి.మీల దూరంలో పయనిస్తోందని, దీని ప్రభావంతో గంటకు 120 నుంచి 130 కి.మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయన్నారు. పోర్‌బందర్, మోర్బీ, రాజ్‌కోట్, ఉత్తర గుజరాత్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.