ఉత్తరాఖండ్‌లోని పురోలాలో గత నెల 26న ఓ యువతిని ఇద్దరు వ్యక్తులు (ఒకరు ముస్లిం, మరొకరు హిందువు) అపహరించేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నాయి. అయితే ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భారీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. హిందూ సంస్థలు దీన్ని ‘లవ్ జిహాద్’గా పేర్కొన్నాయి. ముస్లిం వ్యాపారులు తమ వ్యాపారాలను వెళ్లిపోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఇటీవల పురోలాలో పోస్టర్లు వెలిశాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. గురువారం ఉదయం ఈ ప్రాంతంలోని రోడ్లంతా నిర్మానుష్యంగా కనిపించాయి.