ఇటీవల పెళ్లిళ్లలో వింతలు విశేషాలు బాగానే జరుగుతున్నాయి. కాస్త ఇంట్రెస్టింగ్ సన్నివేశమైనా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఓ పెళ్లికొడుకుకి తన బావమరిది బీరుతో కాళ్లు కడుగుతున్నట్లు కనిపిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే కాళ్లను కడగడానికి అందరూ నీళ్లు ఉపయోగిస్తే.. మనోడు మాత్రం ఏకంగా బీరుబాటిల్తో పెళ్లికొడుకు కాళ్లు కడిగాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంత ప్రేముంటే మాత్రం అలా మందుతో కాళ్లు కడగడమేంటని.. అని కామెంట్స్ చేసేవారు కొందరు, బాటిల్ మందు వేస్ట్ అయిందని మరికొందరు బాధ పడిపోతున్నారు.