భారత ప్రభుత్వం ప్రజలకు తీపి కబురును చెప్పింది. ఆయిల్ దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. కొత్త సుంకాలు జూన్ 15 నుంచి అమలులోకి వస్తాయని చెప్పింది. సుంకాల తగ్గింపుతో నూనె ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. నిత్యాసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీగా ఆయిల్ ధరలను తగ్గించడం జరిగింది.