రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా సీఎం గురువారం ప్రారంభించారు. దీని ద్వారా 209 మారుమూల గ్రామాలకు సేవలు అందనున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైయస్సార్ జిల్లాలో 2 టవర్లను జగన్ ప్రారంభించారు.