ఆస్ట్రేలియాకు చెందిన మహిళా సెనేటర్ లిడియా థోర్ప్ సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ హౌజ్లోనే ఓ సీనియర్ సెనేటర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు, లైగింక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. ఆమె పార్లమెంట్లో మాట్లాడుతూ.. కెమెరా లేని చోట ఓ సెనేటర్ అసభ్యకర రీతిలో తాకినట్లు ఆమె పేర్కొన్నారు. లిబర్ పార్టీ సెనేటర్ డేవిడ్ వాన్ తనను లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించారు. పార్లమెంట్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.