భారత్ లో ఫేస్ బుక్ సేవలను నిలిపేస్తామని కర్ణాటక హైకోర్టు, ఆ సామాజిక మాధ్యమాన్ని హెచ్చరించింది. సౌదీ అరేబియా జైల్లో ఉన్న భారతీయ వ్యక్తికి సంబంధించిన కేసులో, స్థానిక పోలీసులకు సహకరించని కారణంగా ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కావాల్సిన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను వారం రోజుల్లో కోర్టుకు సమర్పించాలని ఫేస్ బుక్ ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.