మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ పై నమోదైన కేసు కొత్త మలుపు తీసుకుంది. మైనర్‌ను లైంగికంగా వేధించినట్లు బ్రిజ్ భూషణ్‌పై స్టార్ రెజ్లర్లు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు మైనర్‌ను బ్రిజ్ వేధించినట్లు ఆధారాలు లేవని ఛార్జిషీట్లో తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టుకు రిపోర్టు ఇచ్చారు. బ్రిజ్‌పై మైనర్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని పోలీసులు రిపోర్టులో కోరారు.