చంద్రబాబు భాగస్వామి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయం కంటే తన లారీ మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లున్నారు. ఆ లారీకి కొండగట్టు, బెజవాడ కనకదుర్గమ్మ, అన్నవరం, పార్టీ ఆఫీసులో పూజ చేశారు. హోమం కూడా చేశారు. మనలో సరుకుండాలే కానీ ఈ లారీకి పూజేంటో అర్ధం కాలేదు. వారాహి అని అమ్మవారి పేరు పెట్టి రాజకీయాలకు వాడుకోవడం ఏంటో అర్ధం కాదు. నిజాయితీగా మాట్లాడితే ఆ లారీకి పెట్టాల్సిన పేరు ‘నారాహి’. తన ప్రసంగంలో బోణీగా గతంలో నేను మాట్లాడిన ప్రసంగాలు వింటుంటే తనకే ఆశ్చర్యమేసిందట. నిజమే కదా..పూటకో మాట మాట్లాడి, నిన్న మాట్లాడిన దానికి వ్యతిరేకంగా నేడు మాట్లాడుతుంటాడు. నీ స్పీచ్‌లు నీకే ఆశ్చర్యమేస్తే ఇక ప్రజలకెంత ఆశ్చర్యమేస్తుందో ఆలోచించండి అని పేర్ని నాని వాపోయారు.