నా ఎస్సీ, నా ఎస్టీ.. అన్న దమ్మున్న నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకరావు పేర్కొన్నారు. మాదిగలంతా వైయస్ జగన్ వెంటే ఉన్నారని తెలిపారు. చంద్రబాబు ఆదినుంచీ దళితులకు వ్యతిరేకంగానే ఉన్నాడు. సామాజిక న్యాయం అంటే ఏదో నలుగురికి పదవులు, పనులు కట్టబెట్టి పదేపదే వారినే చూపుతూ ఇదే సామాజికన్యాయం అని చెప్పుకునే సంస్కృతి టీడీపీలో కనిపిస్తుందన్నారు.