డిసెంబరు నాటికి రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని ఆవాసాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జి సేవలు, 100 జియో టవర్స్‌ను క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో 209 మారుమూల ప్రాంతాలగ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి.