గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో నున్న ఫర్టిలైజర్స్ షాపులు, ఎరువుల షాపులలో ఫర్టిలైజర్ షాపులు నిల్వలు ఉండే ప్రాంతాల్లో గురువారం పర్యటించి ఎక్కడిక్కడ గోదాముల్లో తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేని కల్తీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.