మంగళగిరి నియోజవర్గ పరిధి నూతక్కి లోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం జగనన్న ఆణిముత్యాలు అభినందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు గంజి చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో పదోవ తరగతి, ఇంటర్మీడియట్ లలో ఉత్తమ మార్కుల సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఏపీ స్టేట్ బ్రిలియన్స్ అవార్డు ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపిన నగదు బహుమతులని అందజేశారు.
ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు ఆసుపత్రులకు ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి ప్రైవేట్ కు దీటుగా ఉత్తమంగా తయారుచేసిన సీఎం గా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. నేడు రాష్ట్రంలో చూస్తే దాదాపు చాలా ప్రభుత్వ పాఠశాలల్లో హౌస్ ఫుల్ బోర్డులు కనపడుతున్న విషయం మనందరికీ తెలిసిందేనని అన్నారు. నాడు నేడు, జగనన్న గోరుముద్ద, అమ్మఒడి, విద్య కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన వంటి గొప్ప గొప్ప పథకాలతో పేద విద్యార్థులకు అందవలసిన విద్యని సంపూర్ణంగా అందిస్తూ వారి కుటుంబాలలో సీఎం జగన్ వెలుగునింపారని చెప్పారు.