ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదేనని, అభివృద్ధి అంటే ఇది కాదా? అని ఏఎంసీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపి మండల అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు అన్నారు. గురువారం మండలంలోని జొన్నవలస గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ శాసనసభ ఉప సభాపతి, నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చదివి వినిపించారు.ఈ సందర్భంగా స్థానికులు తీసుకొచ్చిన సమస్యలకు వెనువెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపారు. మార్గమధ్యంలో కల్వర్టు సమస్యను పరిశీలించిన ఆయన. వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.