‘ఫడ్నవీస్ కంటే షిండేకే పాపులారిటీ ఎక్కువ’ అంటూ వచ్చిన పత్రికా ప్రకటనలు మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తలనొప్పి తెచ్చిపెట్టాయి. మంగళవారం పత్రికల్లో మోదీ ప్రకటనలు రావటం, ఆ వెంటనే ‘షిండేనే గ్రేట్’ అనే ప్రకటనలు రావటంతో రెండు పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నేతలు మాటల యుద్ధానికి దిగారు. అయితే.. తమది సైద్ధాంతిక బంధమని, ఇది ప్రత్యర్థుల పనేనని ఉభయపార్టీలూ ప్రకటించటంతో పరిస్థితి దారికొచ్చింది.