కొత్తపల్లె మండలం సంగమేశ్వరం వద్ద పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన రెస్టారెంట్ నిర్వహణకు సంబంధించి వేలంపాటను నిర్వహించారు. గురువారం కలెక్టరేట్లోని పర్యాటక శాఖ కార్యాలయంలో జిల్లా అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో వేలం నిర్వహణ జరిగింది. రూ. 51వేలతో ప్రారంభమైన వేలంలో కొత్తపల్లె గ్రామానికి చెందిన సింగవరం వెంకటరమణ అనేవ్యక్తి రూ. 2. 18లక్షలకు అధిక వేలం పాటపాడి ఏడాది నిర్వహణకు దక్కించు కున్నట్లు తెలిపారు. బహిరంగ వేలం కమిటీ ఆధ్వర్యంలో రెస్టారెంట్ నిర్వహణ ప్రక్రియ పూర్తి చేసినట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖాధికారి సీహెచ్ఎస్ సత్యనారాయణ వెల్లడించారు.