పదో తరగతి చదువుతున్న అమర్నాథ్ అనే విద్యార్థిపై కొందరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలులో జరిగింది. శుక్రవారం ఉదయం ట్యూషన్‌కు వెళ్లొస్తుండగా.. దుండగులు అమర్నాథ్ను అడ్డుకుని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కాలిపోయిన గాయాలతో బాలుడిని గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోని ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.